background img
అద్బుతమైన బతుకమ్మ పాట by ఖతర్నాక్ మంగ్లి.. సూడుండ్రి

కింద మొత్తం పాట గూడ తెలుగుల ఉన్నది, మీరు కూడ పాడనీకి కోశిష్ జెయ్యుర్రి...
అబ్బ అబ్బ ఎన్ని సార్లు ఇన్న గూడ కుతిదీర్తలేదు పో..

బిడ్డ ఈ పాట జేశిన అందరికీ ఆ బతుకమ్మ తల్లి సల్లగ సూస్తది, మంచి బతుకునిస్తది.
ఆ సింగిడిలో రంగులనే దూసి తెచ్చి

తెల్ల చంద్రుడిలో వెన్నెలలే తీసుకొచ్చి
పచ్చి తంగెడుతో గుమ్మాడీ పూలు చేర్చి

బంగారు బతుకమ్మను ఇంటిలొ పేర్చి
బంగారు బతుకమ్మను ఇంటిలొ పేర్చి

ఆడబిడ్డల అరచేతులనే ఊయల కట్టి
వాడవాడలకు ఉత్సవాన్ని మోసుకొచ్చి
పువ్వులనే పూజించే పండుగ తెచ్చె

ఆ.. నీటి మీద నిలిచి..
తామరలు కళ్ళు తెరిచే

ఏటిగట్టు మీద
పూలెన్నో నిన్ను పిలిచె

అందాల బతుకమ్మా రావె..

తెలంగాణలో పుట్టి.. పూల పల్లకి ఎక్కి
లోకమంతా తిరిగే..వటే

పాలసంద్రం పూలే..పూల సంద్రాలయ్యి
నిన్ను అభిషేకించే..నే

పత్తి పువ్వులు నీ.. పెదవుల నవ్వులుగా
గునుగు పువ్వులు నీ.. గుండె సవ్వడిగా
కంది పువ్వులనే  కంటి పాపలుగా..
సీతాజడ పూలే  నీలో సిగ్గులుగా..

తీరొక్క పూలు చేరి.. నీ చీరలాగ మారి
ఆ.. ఆడబిడ్డలాగ
నిను తీర్చిదిద్దుతుంటే
దారుల్లో ఊరేగ రావే...

తెలంగాణలో పుట్టి.. పూల పల్లకి ఎక్కి
లోకమంతా తిరిగే..వటే

పాలసంద్రం పూలే..పూల సంద్రాలయ్యి
నిన్ను అభిషేకించే..నే

ఆ.. మెట్టినిల్లు వీడి చెల్లి..
పుట్టినిల్లు చేరే వేళ
పట్టరాని ఆనందాలే
పల్లెటూరు కోచ్చేనంట

పట్టణాలు వీడి జనం..
సొంతవూరు చేరే క్షణం
చిన్నబోయి ఉన్న గ్రామం..
సందడిగా మారే దినం...
బ్రతుకు పండుగలో..

తెలంగాణలో పుట్టి.. పూల పల్లకి ఎక్కి
లోకమంతా తిరిగే..వటే

పూవుల జాబిలివే పున్నమి వాకిలివే
చీకటికే రంగులు పులిమావే

ఆడపడుచులు నీ కన్న తల్లులయి
పున్నమి రాత్రిలో జోలలు పాడుదురే
ఆట కోయిలలే నీ అన్నదమ్ములయి
కంటికి రెప్పవలె నిన్ను కాపాడుదురే

ఏ తల్లి కడుపులోన నువ్వు పొందలేదే జన్మ
ఈ తెలంగాణ మట్టికి తోబుట్టువు నీవమ్మ
జన్మ జన్మాల బందానివి నీవై

తెలంగాణలో పుట్టి.. పూల పల్లకి ఎక్కి
లోకమంతా తిరిగే..వటే

గావురంగ..పెరిగినీవు...
గడపలు దాటుతుంటే
మళ్ళీరా తల్లి అంటూ..
కాళ్ళ నీల్లారగించి

చెరువుని చేరుకొని
తల్లి నిన్ను సాగనంప

చివరి పాటలతో
నీటనిన్ను దోలుతుంటే
చెమ్మగిల్లేను కళ్ళే...

తెలంగాణలో పుట్టి.. పూల పల్లకి ఎక్కి
లోకమంతా తిరిగే..వటే

పాలసంద్రం పూలే..పూల సంద్రాలయ్యి
నిన్ను అభిషేకించే..నే

పువ్వుల జాతరవే
జమ్మీ పండుగవే

పాలపిట్టొలె మళ్ళిరావె...

ఈ పాట మనుసులు :
దొర - దాము కొసనం
పాట రాశినాయన  -  మిట్టపల్లి సురెందర్
పాట కట్టినాయన -  సురెష్ బొబ్బిలి
కత్తిరిచ్చినాయన  - ఊదయ్ కుంబం
పాటగాల్లు - మంగ్లి, సాకెత్
బొమ్మలు దీశినాయన - తిరుపతి, మధు & రోహిత్(అమెరికా)
నడిపిచ్చినాయన - సతిష్ ఉప్పల
పటేలు - అప్పి రెడ్డి

తెలంగాణలో పుట్టి..పూల పల్లకి ఎక్కి..లోకమంతా తిరిగేవటె

చెరువు పాటల చెలిమె గోరటి వెంకన్న

గోరటి వెంకన్న
 • ఒకప్పుడు పల్లె అందాల్ని చూసి కనువిందు చెందినోడు. 
 • ప్రపంచీకరణలో బందీ అయిన ఆ పల్లెను చూసి కన్నీరు పెట్టినోడు. 
 • సమస్త తెలంగాణ దుఃఖం తన దుఃఖంగా రోధించినోడు. 
 • తన పాటతోనే నిరసన గళాన్ని వినిపించినోడు. 
 • తన గొంతునుంచి ధిక్కార స్వరాన్ని పలికించినోడు. 
 • తెలంగాణ వలస బతుకుల లోతుల్ని తడిమినోడు. 
 • మట్టి మనుషుల ఎతలను ఎదలకద్దుకున్నోడు. 
 • ఎండిన వాగును చూసి వెక్కివెక్కి ఏడ్చినోడు. 
 • ఊరి సంతను ఉద్యమవేదిక చేసి ఏకనాదం మోత మోగించినోడు. 
 • తెలంగాణ ఘోషను పాటగా మలిచి పోరాటానికి ఊపిరిపాటై రేల పూతలు పూయించినోడు. 
 • చలో ధూంధాం అంటూ గల్లీ నుంచి ఢిల్లీదాక మత్తళ్లు దుంకించి ప్రవహించినోడు. 
 • పూసిన పున్నమి వెన్నెల మీదా అలసెంద్రవంకను నిలిపినోడు. 
 • శెరవట్టి నట్టి అరవై ఏండ్ల బలిమి ఓడి ఎదురు చూసిన కల ఎన్నెలయి పూసెనని అంతెత్తున ఎగిరి గంతేసినోడు గోరటి వెంకన్న. 

అస్సోయి.. ఇస్సోయి హైలెస్సా రంగోయీ 
విసురోయీ.. గుంజోయీ వల విసిరి గుంజోయీ 
ఎద్దులనాపోయీ.. నీళ్లను దాపోయీ 
గంతేసి దూకోయీ.. సెరువంత ఈదోయీ 
పిట్టల సుట్టుతా.. పిల్లల పరుగోయీ
కట్టమీద కొంగ బావలూసులోయీ 
నింగివాన గట్టు నేల కొంగినట్టు పారేటి 
ఈ సెరువు పల్లె కెంతందమో! అంటూ ఊర చెరువును వర్ణిస్తాడు గోరటి వెంకన్న.

ఒకప్పుడు పల్లెకు చెరువులే ఆధారం. ఆ చెరువుల అందాన్ని మరింత అందంగా వర్ణించడం ఆయనకే చెల్లింది. ప్రజాకవిగా, పాటల రచయితగా, గాయకుడిగా సుపరిచితుడైన గోరటి వెంకన్న మహబూబ్‌నగర్ జిల్లా గౌరారం గ్రామంలో 1963 లో జన్మించారు. తండ్రి నర్సింహా, తల్లి ఈరమ్మ. తండ్రి యక్షగాన కళాకారుడు. తల్లి కూడా మంగళహారతుల పాటలు పాడేది. దీంతో ఆయనకు చిన్నతనంలోనే పాటతో పరిచయం ఏర్పడింది. చదువుకునే సమయంలో వెంకటరెడ్డి అనే మాస్టారు వెంకన్నలోని సృజనాత్మకతను గుర్తించి ప్రొత్సహించాడు.
ఆయన పాటల్లో తొలుత వామపక్ష భావజాలం ఎక్కువగా కనపడేది. అయితే ఆ తరువాత ఆయన పాటలన్నీ ప్రకృతి, తెలంగాణ చుట్టూ పరిభ్రమించినప్పటికీ నిత్యం జనం నోట్లో నానే పల్లె పదాలు, జానపద పదబంధాలు, ప్రకృతి పరవశాలు ఆయన పాటకు పల్లవులయ్యాయి. పాల నురగల ఏరు పాట దారి చూపింది. గాలికెగసె రెల్లుగడ్డి దరువు నేర్పింది నీటి తెప్పల ఇసుక తిప్ప వేదికయింది ఊటచెలిమె పాటలకు తల ఊపి ఊగింది అని పారే ఏరే పాట నేర్పిందంటాడు వెంకన్న.
ఆయన పల్లె ప్రేమికుడు, ప్రకృతి ప్రేమికుడు. పల్లె అందాలు, ప్రకృతి సోయగాలు, బంధాలు, అనుబంధాలు ఒక్కటేమిటీ కష్టం, నష్టం,సుఖం, దుఃఖం, ఆనం దం, అన్యాయం, వేదన, రోదన, జనం, వనం, చేను, చెలక, చెరువు, వాగు, కొంగ, సంత అన్నీ ఆయన గొంతులో పాటలయ్యాయి. గాలిలోన ఈదుకుంటూ గంగవైపు ఉరుకుతున్న కొంగమ్మా మా పల్లె పిల్లలు అడుగుతుండ్రు పాలంట వోసిపోవె కొంగమ్మా మా కొంగమ్మా అంటూ ఒట్టిపోయిన చెరువుల నుంచి వలస పోతున్న కొంగలను పిలుస్తాడు. ఓ పుల్లా, పుడకా, ఎండుగడ్డి సిన్నకొమ్మ సిట్టిగూడు పిట్టబతుకే ఎంతో హాయి సిగురుటాకు వగరు పూత లేత పిందె తీపిపండొ నోటి కంది సింతలేక కునుకు తీసే పక్షి బతుకే స్వర్గమోయీ అని పక్షి జీవితం ఎంతో సుఖమంటాడు. ఆ ప్రకృతికి పరవశించిన ఆకాశం ఆనందపుష్పాలు నేలరాల్చితే. వానొచ్చెనమ్మా వరదొచ్చెనమ్మా వానతో పాటుగ వణుకొచ్చెనమ్మా అంటూ వానొచ్చినపుడు మనసులు, మనుషుల పరవశాన్ని ఎంతో అందంగా వివరిస్తాడు.
పల్లె అందాల్ని గోరటి వర్ణించినంతగా మరెవరూ వర్ణించలేరేమో. గాలికి ఊగి ఆటాడుతూ నేలకు తలలొంచి సెరువు నీళ్లను ముద్దాడి మురిసే నల్లతుమ్మ చెట్లను... చూసి నా పల్లె అందాలు సూచితే కనువిందురో అంటాడు. సాళ్లు దున్నిన ఎర్రని దుక్కిల సంధ్య పొద్దు వాలి వొదిగి నపుడు ఆ సెలుక, ఆ పల్లె ఎంత అందంగా ఉంటుందో చూపడం ఒక వెంకన్నకే సాధ్యం. తల్లి ఈరమ్మ అన్న, ఆమె పాటలన్న గోరటి వెంకన్నకు అమితమైన ప్రేమ. అందుకే ఆమె కూడా ఆయన పాటలో ఒదిగిపోయింది. కంచెరేగి తీపివోలె లచ్చువమ్మో-నీ కంఠమెంత మధురమే ఓ లచ్చుమమ్మ పారె ఏటి అలలమీద పండు వెన్నెల రాలినట్లు- ఊరె ఊట చెలిమెలోనా తేనీరు తొలికినట్లు వెండి మెరుపుల నవ్వు నీదె లచ్చువమ్మో- నీ దెంతని చక్కని రూపమె ఓ లచ్చువమ్మా అంటూ అమ్మ రూపాన్ని ప్రకృతితో ముడివేస్తూ పాటగా మలిచిన తీరు మన బాల్యాన్ని గుర్తు తెస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో వారానికి ఒకసారి సాగే సంతలను గుర్తు చేస్తూ సంత మా ఊరి సంత వారానికోసారి జోరుగా సాగేటి సంత మా ఊరి సంత సుట్టు ముప్ఫైఊర్ల పెట్టు జనమందరూ పుట్ట పగిలి సీమలొచ్చినట్టొస్తారు అంటూ వర్ణించాడు. అలాగే పట్నం జీవితంలోని కోణాలను వర్ణిస్తూ, చిన్న చిన్న ఇరుకు గదులల్లో పేదరికం మగ్గుతున్న తీరును వివరిస్తాడు వెంకన్న. గల్లీ సిన్నదీ గరీబోల్ల కథ పెద్దది వాళ్ల ఇండ్లు కిళ్లి కొట్ల కన్న సిన్నగున్నవో ఇండ్లకన్న మేలురా ఆ ఫలక్‌నామ బండ్లురా అంటాడు.
తెలంగాణ వచ్చిన తర్వాత బందూక్ చిత్రం కోసం ఆయన రాసిన బ్రీత్‌లెస్ సాంగ్ అందరి మన్ననలు అందుకుంది. పూసిన పున్నమి వెన్నెల మేన తెలంగాణ వీణ వాసిక చరితల వెలుగొందిన గత వైభవాల కోన పదగతుల వాణి, స్వరజతుల వేణి ఉప్పొంగి మురిసె ఉల్లముల బాణి అంటూ తెలంగాణ పది జిల్లాలను ఎంతో అందంగా తన పాటలో వర్ణించాడు. స్వరాష్ట్రం వచ్చిన ఆనందాన్ని వెంకన్న ఎంతో ఆనందంగా, ఆవేదనగా, ఆర్ద్రంగా వర్ణించాడు. రాములోరి సీతమ్మా..సీతమ్మోరి రామయ్యా.. ఎదపైన దిగులు బండ జరిగి - ఎండిన సెలిమె అనుభూతి కలిగెనో శెరవట్టి నట్టి ఆరవైఏండ్ల బలిమి ఒడెనో కలనిజమా యని నేల తనను తడుముకున్నదో ప్రకృతిలోని అందాలను, అగాధాలను అన్నింటినీ తన పాటల్లో వర్ణించిన గోరటి వెంకన్న పలు సినిమాలకు కూడా పాటలు రాశారు. వాటిలో శ్రీరాములయ్య, కుబుసం, వేగుచుక్కలు, మహాయజ్ఞం, మైసమ్మ ఐపీఎస్, బతుకమ్మ, నగరం నిద్రపోతున్న వేళ, పీపుల్స్‌వార్, బందూక్ ముఖ్యమైనవి. మరికొన్ని సినిమాల్లో ఆయన నటించారు కూడా.

సాహిత్యానికి ఆయన చేసిన సేవలకు గాను 2006 లో కళారత్న (హంసా అవార్డు), 2016లో కాళోజీ నారాయణరావు ఆవార్డు అందుకున్నారు. చెరువు మీద ఆయన రాసిన పాటలకు గాను మిషన్ కాకతీయ అవార్డు కూడా పొందారు. సోయగమే వెన్నెలకు అంతర్జాతీయ గుర్తింపు తెలంగాణ వాగ్గేయకారుడు గోరటి వెంకన్న రాసిన సోయగమే వెన్నెల పాటకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. దేశంలోని 15 ప్రాంతీయ భాషల్లో వచ్చిన గేయాల నుంచి ఒక్కొక్కటి చొప్పున ఆంగ్ల అనువాదానికి ఎంపిక చేయగా తెలుగు నుంచి వెంకన్న పాట ఎంపికైంది. రాజా ఫౌండేషన్ సంస్థ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ది రాజా బైఎనేల్ ఆఫ్ ఇండియన్ పోయట్రీ పేరిట పదిహేను భాషలకు చెందిన 45 మంది కవులు, రచయితలతో త్రివేణి సంగమంలో సాహిత్య కార్యక్రమంలో వెంకన్న తన పాట పాడి ఆ పాట నేపథ్యాన్ని, సందర్భాన్ని వివరించారు. దీంతో సామాజిక నేపథ్యంతో కూడిన ఆ పాటను ఆంగ్లంలోకి అనువదించాలని నిర్ణయించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదుతూ వెంకన్న రాసిన పాటలు ఉద్యమ సమయంలో ప్రజల్ని ఉర్రూతలూగించాయి.ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా? ఇండియా పాకిస్తనోలే ఇనుప కంచె పడుతుందారావొచ్చు పోవొచ్చు రొయ్యలమ్ముకోవచ్చు. నువ్వు పద్యం పాడితే మేము వన్స్‌మోర్ గొట్టొచ్చుకానీ దాశరథి, కాళోజీని దాసిపెడితే కుట్ర గాద పొమ్మంటే పోవేందిర పోరా ఆంధ్రదొర రేలా దులా తాలెల్లాడే నేలా నా తెలంగాణ- సుడిగాలికి చెదిరిన పక్షోలాయే నా తెలంగాణ. తల్లీ తెలంగాణమా తనువెల్ల మాగాణమా గానమా మా ప్రాణమా తెలంగాణమా జనగానమా గర్భాన సింగరేణి గళమున మధురవేణి సిరుల గిరులతోని విరజిల్లే మేటి ధరణి పరుగు పరుగున వచ్చినారు పట్నముల వాలినారు గుమ్మాలకు బొమ్మలోలె గుడ్లు ఎల్లవెట్టినారు ఏ ఆఫిసు మెట్లెక్కిన జిల్లేలమ్మ జిట్ట ఆళ్లు ఎదురుంగనే గూసుంటరు జిల్లేలమ్మ జిట్ట మందెంట వోతుండు ఎలమంద వాడు ఎవ్వని కొడుకమ్మ ఎలమంద సూస్తె శిన్న పోరగాడు ఎలమంద తెలంగాణ జెండా వట్టె ఎలమంద. నాటి ప్రభుత్వానికి చరమగీతం పాడిన పల్లె కన్నీరు..పాట ప్రపంచీకరణ, పరదేశీకరణ, సామ్రాజ్య వాద విస్తరణ మూలంగా వృత్తులు కనుమరుగై విస్తరిస్తున్న ఆధునికతను తన పాటతో ఎండగట్టిండు వెంకన్న. మానవతా విలువలు అడుగంటి, స్వావలంబన కనుమరుగవుతున్న తీరు పాటలో వర్ణించడం ద్వారా శ్రోతలతో కన్నీరు పెట్టించాడు. సామ్రాజ్యవాద ప్రభుత్వ పాలనకు ఈ పాటే చరమగీతం వంటిదంటారు. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల నా తల్లీ బందీ అయిపోతుందో కనపించని కుట్రల కుమ్మరి వామిలో తుమ్మలు మొలిచెను కమ్మరి కొలిమిలో దుమ్ము పేరెను అంటూ బహుళజాతి కంపెనీలు పల్లెలను కబలిస్తున్న తీరును, జీవన విధానాన్ని, వృత్తుల్ని ఛిద్రం చేస్తున్న తీరును ఆయన ఎంతో ఆర్ధ్రంగా వివరించారు. ఈ పాటను కుబుసం సినిమాలో వాడుకున్నారు

Our Hearty Thanks to  -మధుకర్ వైద్యుల, సెల్: 80966 77409 

పల్లెపాటకు పట్టాభిషేకం అందెశ్రీ
పల్లెపాటకు పట్టాభిషేకం అందెశ్రీ

అందెశ్రీ
 • ఆయన పాటలు జనబాహుళ్యాన్ని తట్టిలేపే జయకేతనాలు.
 • మాయమైపోతున్న మనిషితనాన్ని వెలికి తీసే శ్రామిక జనరంజనులు. 
 • ఆ పాటలు తెలంగాణ నుదుట సింధూరమై పొడిచిన రంగుల సింగిడీలు. 
 • నజాతరలో మనగీతాలై పల్లె పొలిమేరలో నినదించిన కొత్తపల్లవులు. 
 • ఆయన చెక్కిన కొమ్మలు దేవతల బొమ్మలై ఊరు ఊరంతా ఉద్యమగీతాలై ఊరేగాయి.
 • తెలంగాణ, ప్రకృతి, పల్లెకవిగా ప్రజాసాహిత్యం, పల్లెపాటలు, ఉద్యమగీతాలు ఇలా పాటేదైనా మన మట్టి పరిమళాలద్దినవాడు అందెశ్రీ. 

అందెశ్రీ ప్రకృతి చెక్కిన కవి. నిజానికి ఆయన చదువుకోలేదు. కానీ ఆయన పుట్టిన ఊరు, ప్రకృతే ఆయనను పాటగాడిగా తీర్చిదిద్దింది. ప్రజలబాణీలనే పల్లవులుగా చేసుకుని ఆయన రాసిన పాటలు తెలంగాణ వేదికలెక్కి జనాన్ని ఊర్రుతాలూగించాయి.

తెలంగాణ సంస్కృతి సంప్రదాయపు మూలాల్ని ఒడిసిపట్టుకుని పాటకు కొత్త బాణీలు అద్దినవాడు అందెశ్రీ. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. వరంగల్ జిల్లా మద్దూర్ మండలంలోని రేబర్తి అనే గ్రామంలో 1961 జూలై 18న జన్మించారు.

మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు. మచ్చుకైనా లేడు చూడూ మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు ఏడ ఉన్నడో కానీ కంటికీ కానరాడు
ఆధునికత పేరుతో మనిషి కానరాకుండా పోతున్న వైనాన్ని పది సంవత్సరాల క్రితమే అందెశ్రీ తన పాట ద్వారా వివరించారు. మానవత్వం మరిచి మనిషితనాన్ని కోల్పోతున్న మనిషి మాయమైపోతున్నాడని వాపోతాడాయన. 2007లో వచ్చిన ఎర్రసముద్రం సినిమా కోసం ఈ పాటను వాడుకున్నారు. అంతేకాక ఇంటర్‌లో ఈ పాట ఒక పాఠ్యాంశంగా చేర్చడం విశేషం.

అందెశ్రీ తండ్రి అందె బుడ్డయ్య వ్యవసాయ కూలీ. దీంతో అందెశ్రీ చిన్నతనంలోనే పశువులు కాసే జీతగాడిగా మారాల్సి వచ్చింది. ఆయనకు చదువుకునే అవకాశం రాలేదు. గ్రామాల్లో నిరంతరం జరిగే యక్షగానాలు, కోలాటాల పాటలు ఆయనలోని కవిని నిద్రలేపాయి. చదువుకునే వయస్సులోనే గొర్రెలు కాసేందుకు కుదిరాడు. అలా గొర్రెల మందతో అడవులు, వాగులు, వంకల్లో తిరుగుతూ ప్రకృతితో మమేకమయ్యాడు. ప్రకృతిని ఆరాధిస్తూ పరవశించి స్పందించి రాసిన పాటలెన్నో.

 చూడచక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి- నా పల్లె పాలవెల్లి మళ్లి జన్మంటూ ఉంటే సూరమ్మో తల్లి నీ కడుపున పుడతా మాయమ్మ  అంటూ చుక్కల్లో జాబిల్లిలా చూడచక్కనైనా, పాలవెల్లి లాంటి పల్లెను తలచుకుంటూనే తనను ఆదరించి అన్నం పెట్టిన తల్లిలాంటి సూరమ్మను కీర్తిస్తాడు అందెశ్రీ.

ఆయన చదువుకోనప్పటికీ మల్లారెడ్డి అనే అసామి దగ్గర పనిచేస్తున్న సమయంలో ఆయన చెప్పిన రామాయణ, మహాభారత, భాగవతాలు ఆయనను ఆధ్యాత్మిక చింతనకు చేరువ చేశాయి. మనిషిగా నేను పుట్టింది రేబర్తిలో అయినా కవిగా పుట్టింది నిజామాబాద్‌లో అంటారు అందెశ్రీ. అవును ఆయన తాపీ పనివాడిగా నిజామాబాద్‌కు వలస వెళ్లారు. స్వామి అనే మేస్త్రీ ఆయనను ఆదరించి అక్కున చేర్చుకున్నాడు. అలాగే అక్కడికి దగ్గర్లోని హమ్రాద్ గ్రామంలో శృంగేరీ మఠం ఉండేది. అక్కడి శంకర్ మహరాజ్ అనే స్వామి అందెశ్రీకి మంత్రోపదేశం చేసి కవిగా నిలబెట్టారని ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు.  ఆయన సహచర్యంతో నిత్యం ఉపనిషత్తులు, వేదాంత పఠనం అబ్బింది. అప్పటి వరకు వైరాగ్యంతో ఉన్న ఆయనలో ఏదో తెలియని శక్తి ఆవహించింది. ఆయన బోధనల వల్ల దార్శనికత, ఆధ్యాత్మిక చింతన పెరిగాయి. అక్కడే అయనలో ఒక గొప్ప కవి ఉన్నాడన్న విషయం తెలిసింది. అలా మొదలైన ఆ గేయాల ప్రవాహం పాటల పూదోటలై విరబూశాయి. తను పాటగాడిగా ఎదగడానికి కారణమైన పల్లెకు ఆయన రుణపడి ఉంటానంటారు.

పల్లె నీకు వందనాలమ్మో నన్ను గన్న తల్లి నీకు వందనాలమ్మో నాకు పాటనేర్పి, మాటనేర్పి బతుకు బాట చూపినందుకు పల్లె నీకు వందనాలమ్మో  అంటూ పల్లె తల్లికి తన పాటతో పట్టాభిషేకం చేశారు అందెశ్రీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రకు కాకతీయుల కీర్తి తోరణాన్ని అందించిన ఓరుగల్లు చరిత్రను, కాకతీయుల పరిపాలనను తన పాటతో ప్రాణప్రతిష్ట చేశారు.
గలగలగల గజ్జెలబండి గల్లు చూడు ఓరుగల్లు చూడు నాటి కాకతీయులు ఏలినట్టి ఖిల్లా చూడు నా జిల్లా చూడు అంటూ కాకతీయుల కన్న బిడ్డ రుద్రమదేవి పుట్టిన గడ్డను, విజయతోరణం, వారు తవ్వించిన గొలుసుకట్టు చెరువులు, ప్రజాపరిపాలనను తన పాటలో వివరించారు.

అందెశ్రీ రాసిన ఒక్కోపాట ఒక్కో ఆణిముత్యం. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర గీతంగా వినతికెక్కిన జయజయహే తెలంగాణ గీతం గురించి తెలియని వారుండరు. జయజయహే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లీ నీరాజనం పది జిల్లాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం అంటూ నాడు తెలంగాణలో ఉన్న పది జిల్లాలను ప్రస్తావించారు. జయజయహే తెలంగాణ అనే పల్లవి తెలంగాణ అంతటినీ ప్రతిబింబించేలా పోతన పురిటిగడ్డ రుద్రమ వీరగడ్డ అంటూ ఓరుగల్లు కీర్తిని వర్ణిస్తూ 12 చరణాలతో ఈ గేయాన్ని 2009లో రాశారు. అయితే ప్రస్తుతం పల్లవితో పాటు 4 చరణాలనే ఎక్కువగా పాడుకుంటున్నారు.

 ఆపదలు, అనర్థాలు వచ్చినప్పుడు గ్రామాన్ని కాపాడేందుకు గ్రామదేవతలుంటారంటారు అందెశ్రీ. ఒక తల్లి తన పిల్లలను కాపాడుకున్నట్లే గ్రామదేవతలు కూడా గ్రామాన్ని అలాగే కాపాడుతారంటారాయన. ఈ పాటలో అమ్మను, అమ్మతనాన్ని ఎంతో అద్భుతంగా వివరించారు అందెశ్రీ.

"కొమ్మ చెక్కితే బొమ్మరా-కొలిచిమొక్కితే అమ్మరా ఆదికే ఇది పాదురా- కాదంటే ఏది లేదురా జాతిగుండెలో జీవనదముల -జాలువారే జానపదముల గ్రామమును కాపాడ వెలిసిరి గ్రామ దేవతలెందరో. "

నారాయణమూర్తి తెరకెక్కించిన చాలా సినిమాల్లో అందెశ్రీ పాటలు రాశారు. ఈ పాటను కూడా ఆయన 2004లో వచ్చిన వేగుచుక్కలు చిత్రంలో వాడుకున్నారు. అంతేకాదు, బతుకమ్మ సినిమా కోసం ఆయన సంభాషణలు కూడా రాశారు. నదుల పుట్టుక మీదా పరిశోధన చేయతలచి ప్రపంచంలోని నదులన్నింటినా ఆయన చుట్టిరావడం విశేషం. ఆ నదిని కీర్తిస్తూ కూడా ఆయన పాటలు రాశారు. నది నడిచిపోతున్నది-నన్ను నావనై రమ్మన్నది పలుమారు పిలుచునది- నాలో ప్రాణమై దాగునది అంటారు. అంతేకాదు, మహిళలు ఏడవకూడదని తను అన్నలా తోడుంటానంటారు ఓ పాటలో ఆడబతుకే పాడు బతుకని - ఏడుస్తావెందుకే చెల్లెమ్మా నీవు జడుస్తావెందుకే మాయమ్మ నీ అన్నను తోడున్ననమ్మా అంటూ ఆడవారికి మనోధైర్యాన్నిస్తారాయన. ఇలా ఒక్కటని కాదు, ఎన్నో పాటలు. ఆయన రాసిన ప్రతి పల్లవి లక్షల స్వర్ణకంకణాలకు, ఒక్కో చరణం కోట్ల గండపెండేరాలకు సరిసమానం.

 పాటకు ఆయన చేసిన సేవలకు గాను కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. మరోవైపు అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్, వాషింగ్టన్ డి.సి వారి గౌరవ డాక్టరేట్‌తో పాటు లోకకవి బిరుదునిచ్చింది. వంశీ ఇంటర్నేషనల్ వారు దాశరథి సాహితీ పురస్కారం, డాక్టర్ రావూరి భరద్వాజ, రావూరి కాంతమ్మ ట్రస్ట్ వారిచే డాక్టర్ రావూరి భరధ్వాజ సాహితీ పురస్కారం తదితర పురస్కారాలెన్నో ఆయన ఖాతాలో చేరాయి.

 ఉద్యమ సమయంలో వచ్చిన జైబోలో తెలంగాణ చిత్రం కోసం ఆయన రాసిన జనజాతరలో మన గీతం మరో ఆణిముత్యం. జనజాతరలో మనగీతం-జయకేతనమై ఎగరాలి జంఝా మారుత జన నినాదమై- జే గంటలు మోగించాలి ఒకటే జననం ఓహో.. ఒకటే మరణం ఆహా.. జీవితమంతా ఓహో- జనమే మననం ఆహా ఉద్యమానికి ఊపునివ్వడంతో పాటు నిద్రాణమై ఉన్న తెలంగాణ రణనినాదాన్ని రగిలించిన ఈ పాట అందెశ్రీ కలం నుంచి జాలువారిందే. 2006లో వచ్చిన గంగ సినిమాకోసం ఆయన యెల్లిపోతున్నావా తల్లి అనే పాటకు గాను నాటి ప్రభుత్వం నుంచి నంది పురస్కారాన్ని అందుకున్నారు.

తెలుగు సాహితీ విశ్వంభరుడు సినారె

 29 July 1931 - 12 June 2017

ఆధునిక తెలుగు సాహిత్యానికి వన్నెలద్దిన మేరు నగధీరుడు.
తెలుగు అక్షరానికి జ్ఞానపీఠాన్ని అందించిన విశ్వంభరుడు.
తెలుగు సాహితీ ప్రస్థానాన్ని దిగంతాలకు చేర్చిన నిత్య సాహిత్య కృషీవలుడు.
తెలుగు సినిమా పాటలకు కొత్తసొబగులు అద్దిన పాటల మాంత్రికుడు.

పద్యం, గేయం, వచనం, పాట, గజల్, బుర్రకథ ఇలా సాహిత్య ప్రక్రియ ఏదైనా ఆయన కలం నుంచి జాలువారే ప్రతి అక్షరమూ ఒక ఆణిముత్యమే. కవిగానే కాకుండా పండితునిగా, పరిశీలకునిగా బహుముఖ ప్రజ్ఞ ఆయన సొంతం. తెలుగు సాహితీ సార్వభౌముడు డాక్టర్ సి.నారాయణ రెడ్డి. సినారెగా సుపరిచితుడైన డాక్టర్ సి. నారాయణ రెడ్డి పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణరెడ్డి.
ఆయన 1931 జులై 29న కరీంనగర్ జిల్లా హనుమాజీపేటలో జన్మించారు. ఆయన చదువంతా ఉర్దూ మాధ్యమంలో సాగినప్పటికీ తెలుగు సాహిత్యంపట్ల మక్కువ పెంచుకున్నారు. పల్లెపదాలు, వినోదాలు, కథాగానంపై మక్కువ పెంచుకోవడంతో పాటు చిన్నతనంలోనే కవితా ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1953లోనే నవ్వని పువ్వు పేరుతో తొలి కవితా సంపుటిని వెలువరించి అందరి మన్ననలూ అందుకున్నారు. తరువాత విశ్వగీతి, నాగార్జునసాగరం, స్వప్నభంగం, కర్పూర వసంతరాయలు వంటి కవితా సంపుటాలు తీసుకువచ్చారు.

1962లో కళాశాల అధ్యాపకుడిగా ఉన్న సమయంలో ఎన్‌టీ రామారావు కోరిక మేరకు గులేబకావళి కథ సినిమా కోసం తొలిసారి పాట రాశారాయన. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అంటూ సినారె రాసిన తొలిపాటనే ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఇక ఆయన వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు.

అలా 3500లకు పైగా సినిమా పాటలు రాశారు. 1963లో బందిపోటు చిత్రం కోసం వగలరాణివి నీవే సొగసుకాడను నేనే ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే... అంటూ ఇష్టసఖిని ప్రేమతో పిలుస్తూనే పిండివెన్నెల నీ కోసం పిల్లతెమ్మెర నాకోసం రెండు కలిసిన నిండుపున్నమి రేయి మనకోసం అంటూ కవ్విస్తాడు ప్రియుడు. ఓహో ఓ ఓ ఓహోహో ఓ ఓ ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెనో ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో ఓ.. ఓ అంటూ అమరశిల్పి జక్కన చిత్రం కోసం ఆయన రాసిన పాట అశేష ఆదరణ పొందింది. చూడడానికి నలుపు రంగులో ఉండే రాళ్లను చెక్కితే కొత్త జీవం పోసుకుంటాయంటారాయన.
 తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలు అమోఘం. 1988లో ఆయన రాసిన విశ్వంభర కావ్యానికి గాను ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె 19 సాహితీ ప్రక్రియల్లో 92 పుస్తకాలు రాశారు. 116 కవితలతో నా రణం మరణంపైనే అనే కవితా సంపుటిని తీసుకువచ్చారు.
 Sinare అన్నా చెల్లెళ్ల అనురాగానికి గీటురాయిగా నిలిచిన అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి- కనిపించని దైవమే ఆ కనులలో ఉన్నది అంటూ అన్నాచెల్లెల మధ్య ఉండే అప్యాయతలు, అనుబంధాలు, అనురాగాల్ని బంగారు గాజులు చిత్రంలో సినారె వివరిస్తారు. కృష్ణానది విశిష్టతను నారాయణరెడ్డి కృష్ణవేణి చిత్రంలో ఎంతో అందంగా వివరించారు. కృష్ణవేణి.. తెలుగింటి విరిబోణి అని నాయిక పాడితే కృష్ణవేణి నా ఇంటి అలివేణి అంటూ కథానాయకుడు గళం కలుపుతాడు. శ్రీ గిరి లోయల సాగేజాడల విద్యుల్లతలు వేయి వికసింపజేసేను అంటూ సాగుతుంది ఈ పాట.
ఇక తండ్రి గొప్పతనాన్ని వివరిస్తూ ధర్మదాత (1970) చిత్రంలో ఆయన రాసిన మరో అద్భుత మైన పాట - ఓ నాన్నా ఓ నాన్నా ఓ నాన్న నీ మనసే వెన్న అమృతం కన్నా అది ఎంతో మిన్న అంటూ కంటికి రెప్పలా సాకే తండ్రిని ముళ్లబాటలో నీవు నడిచావు. పూలతోటలో మమ్ము నడిపావు అని కీర్తిస్తాడు. అంతేకాదు మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మన దేశాన్ని మరిచిపోవద్దంటూ కోడలు దిద్దిన కాపురం చిత్రంలో నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవద్దు అంటాడు.
హైదరాబాద్ రిక్షావాలా సినారె వర్ణించినంతగా మరెవరూ వర్ణించలేదేమో అనిపించే గీతం. రింఝిం రింఝిం హైదరాబాద్..రిక్షావాలా జిందాబాద్ - మూడు చక్రములు గిరగిర తిరిగితే మోటరుకారూ బలాదూర్ అంటాడు మట్టిలో మాణిక్యం చిత్రంలో. స్నేహాన్ని స్నేహితుల గొప్పతనాన్ని వివరిస్తూ సినారె రాసిన అద్భుత గీతాలు 1972లో వచ్చిన బాలమిత్రుల కథ చిత్రంలోనివి.
గున్నమామిడి కొమ్మమీద గూళ్లు రెండున్నాయి ఒక గూటిలోన రామచిలకుంది. ఒక గూటిలోన కోయిలుంది అంటారు సినారె. నిప్పులాంటి మనిషి చిత్రంలో స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అంటూ స్నేహన్ని బలపరుస్తుంది.
తనకు ఇష్టమైన కథానాయికను వర్ణిస్తూ అభినవ తారవో.. నా అభిమాన తారవో అభినవ తారవో అంటాడు అభినయ రసమయ కాంతిధారవో మంజుల మధుకర శింజాన సుమశర శింజినీ శివరంజనీ..శివరంజనీ అంటూ పాడుతాడు.
ఒసేయ్ రాములమ్మ చిత్రంలో టైటిల్‌సాంగ్ ఓ ముత్యాల రెమ్మ.. ఓ మురిపాల కొమ్మ.. ఓ పున్నమీ బొమ్మ.. ఓ.. ఒసే రాములమ్మా అంటూ రాసిన గీతం అద్భుతం.
అట్లే తెలుగు సాహిత్యాభివృద్ధికి ఎనలేని సేవ చేసిన సినారె 1981లో అప్పటి ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి మాతృభాష వాడకాన్ని పెంపొందించారు.
1969-73 వరకు రాష్ట్ర సాహిత్య అకాడమీలో చురుకైన పాత్ర,
1992లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో భాషా సాంస్కృతిక సలహాదారులుగా పనిచేశారు.
1997లో మంత్రిహోదాలో సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా నియమితుడై 2004 వరకు పనిచేశారు.
1997 నుంచి ఆరేళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.

పాటలో ఏముంది- నా మాటలో ఏముంది అంటూ ఆయన చెప్పిన ముచ్చట్లు 2 పుస్తకాలుగా వచ్చాయి. వారి సతీమణి సుశీల సంస్మరణగా ప్రత్యేక మహిళా పురస్కారం, ఓపెన్ యూనివర్సిటీలో ప్రతిభావంతులైన విద్యార్థులకు స్వర్ణపతకాలు అందిస్తున్నారు.
సినారె కవిత్వం విశిష్టతలపై 10 పీహెచ్‌డీలు, 18 ఎంఫిల్‌లు ఆయా యూనివర్సిటీలు ప్రధానం చేశాయి. ప్రస్తుతం తెలంగాణ సారస్వత పరిషత్‌కు 1994 నుంచి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
ఆయనకు గంగా, యమునా, సరస్వతి, కృష్ణవేణి అనే నలుగురు కూతుళ్లున్నారు. విశ్వంభర, మనిషి-చిలక, ముఖాముఖి, భూగోళమంత మనిషి, దృక్పథం, కలం సాక్షిగా, కలిసినడిచే కలం, కర్పూర వసంతరాయలు, మట్టిమనిషి, ఆకాశం, తేజస్సు నా తపస్సు, నాగార్జున సాగరం, జలపాతం, విశ్వగీతి, విశ్వనాథనాయుడు, కొనగోటిమీద జీవితం, రెక్కల సంతకాలు, వ్యక్తిత్వం మొదలైన కవితా సంపుటాలు, పరిణత వాణి పేరుతో వ్యాసాలు, 1955లో అజంతా సుందరి సంగీతరూపకం రచించారు.
తెలుగు గజల్స్, ఆధునికాంధ్ర కవిత్వం - సంప్రదాయాలు -ప్రయోగాలు అంశంపై ఆయన చేసిన పరిశోధన గ్రంథానికి డాక్టరేట్ లభించింది.
విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ్,(1988) లభించింది.
1977లో పద్మశ్రీ,
1978లో కళాప్రపూర్ణ,
 1992లో పద్మభూషణ్‌లు సినారెను వరించాయి.
 స్వాతిముత్యం చిత్రంలో లాలిలాలి లాలీ లాలి వటపత్రశాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి అంటూ బాబును నిద్రపుచ్చుతూ రాసిన పాట నాటికి నేటికి ఎవర్‌గ్రీన్.

సూత్రధారులు చిత్రంలో జోలాజోలమ్మ జోల.. నీలాలా కన్నులకు నిత్యమల్లె పూలజోల అని జోలపాడుతాడు. అమ్మ గొప్పతనాన్ని కూడా సినారె అద్భుతంగా వర్ణించారు.

20వ శతాబ్ధం చిత్రంలో అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించిన అర్థమున్నదా.. జగమే పలికే శాశ్వత సత్యమిదే అంటూ అమ్మగొప్పతనాన్ని అమృతమంతా మధురంగా వర్ణించాడాయన.

అట్లే ప్రేమించు చిత్రంలో కంటేనే అమ్మ అని అంటే ఎలా కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్న అమ్మే కదా అంటాడు.

తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే చలిగాలి రమ్మంటు పిలిచిందిలే చెలిచూపు నీపైన నిలిచిందిలే అంటూ నాయకుని అసలు రూపం తెలుసుకున్న చిత్రనాయిక అతన్ని ఏడిపించాలనే ఉద్దేశంతో పాటందుకుంటుంది రాముడు భీముడు చిత్రంలో.
అరుంధతీ చిత్రంలోనూ జేజమ్మా జేజమ్మా..జేజమ్మా జేజమ్మా వంటి గీతాలెన్నో సినారె కలం నుంచి జాలువారాయి.
తెలుగు జాతి మనది, నిండుగ వెలుగు జాతి మనది అన్న తన పాటకు తెలంగాణ ఉద్యమ సమయంలో రెండుగా వెలుగు జాతి మనది అని మార్చారు.

Thank you Arundathi.   Source - Namaste Telangana Sunday Magazine

బంధాల బంధాలు తెంచుతుండు మనిషి by Thirupathi MaatlaPost by Telangana Paata.

బంధాల బంధాలు తెంచుతుండు మనిషి

బంధాల బంధాలు తెంచుతుండు మనిషి by Thirupathi Maatla

బంధాల బంధాలు తెంచుతుండు మనిషి by Thirupathi MaatlaPost by Telangana Paata.

బంధాల బంధాలు తెంచుతుండు మనిషి

పది జిల్లాల నా తెలంగాణ, కోటి రతనాల వీణ

పూసిన పున్నమి వెన్నెల మేన తెలంగాణ వీణ
వాసిగ చరితల వెలుగొందిన గత వైభవాల కోన
పద గతుల వాణి స్వర జతుల వేణి
ఉప్పొంగి మురిసె ఉల్లముల బాణి
తాళాల జోల దరువుల యాల
సంబురమాడె సింగిడి మేళ
అరె మోదుగు పూల వసంత హేల
తంగెడు పూల బంగరు నేల
జమ్మి కొమ్మన పాల పిట్టల గంతులేసె ఆ జింక పరుగున
యిడుపు యిడుపునా జానపదంబులు
యింపుగ పూసిన కవనవనంబులు
యెగసి పారె ఎన్నెన్నొ యేరులు
మురిసి ఆడె బతుకమ్మ ఊరులు

నల్లగొండ
బుద్దుని పాదపు ముద్రల బండ మన ఫణిగిరి కొండ
పద్మ నాయకుల దేవరకొండ    మేటి రాచకొండ
కొలనుపాక తీర్ధంకర పాద
వర్ధమాన ముని తెలిపిన బోధ
యాదగిరి నరసన్న మొక్కులు
జానుపాడు సైదన్న సూక్తులు
వడి వడి కలబడి కుడి ఎడమల బడి
గడీల పొగరును దించిన దళములు
వాడిగ వడిసెల విసిరిన కరములు
పడి పడి పరుగులు పెట్టిన జులములు
నందికొండ నీటితో నిండ ఊరు ఊరున పైరులు పండ
కరువుల బరువులు జరుగును దూరం
నల్లగొండ వరి తరి మాగాణం

రంగారెడ్డి
పారే వాగులు పచ్చని కొండలు
పరిమళమైన పూల గాలులు
కీసర గుట్టలు హరి కీర్తనలు
శివతత్వంబులు అనంతగిరులు
భూమిల దాగిన సలువకొండలు
తాండురు శాబాదు బండలు
కుంకుమ కన్నా మెత్తని దుక్కులు
కూరలు కాయలు కుప్పల రాసులు
రంగారెడ్డి నేలకు విలువ
కుంచములతో బంగారము కొలువ

వరంగల్
పాలకుర్తి కవనపుమేళా
భాగవతము ఘన పోతన లీల
కాకతీయ గణపతి వీర
యుగంధరుడు యోచనలో ధీర
పాకాల రామప్ప చెరువులు
గొలుసుకట్టు జలధార నెలువులు
వేయి స్థంభముల శబ్ధ నాదములు
పేరిని భేరిని నాట్య పాదములు
సమ్మక్క సారక్కల తెగువ
సర్వాయి పాపన్నని మడువ
ఓరుగల్లు అడుగడుగున గుళ్లు
తలచుకుంటే పులకించెను ఒల్లు

కరీంనగర్
మేటి ఏలికలు శాతవాహనుల
కోటి లింగముల పురమీనేల
కోడె ముడుపులకు భజన కొలువులకు
వరములిచ్చె రాజన్న లీల
ఊరి ఊరిలోన ఉక్కుకు మించినట్టి కోట
ఉబికే చరితల ఊట
సిరిసిల్ల మగ్గాల నేత
మేనికి అద్దిన సొగసుల పూత
కవనం భువనం ఎల్లలుదాట
కరీం నగరు వాగ్దేవికి బాట
జ్ణానపీఠమై పూసిన తోట

మహబూబ్ నగర్
తెలుగు వాకిట పరువంబొలికె
కృష్ణవేణి ముఖద్వారం
పుప్పొడి మించిన ఇసుక రేణువుల
అందమైన దుందుభి తీరం
మన్నెంకొండ సిరిసనగండ్ల
గట్టు కూర్మతి జోగులాంబ
రామగిరి శ్రీరంగాపురములు
నల్లమల సలేశ్వరతీర్ధం  
తరాలు గడిసిన వాడని వూడల
ఊయలలూపే పిల్లల మర్రి
పాలమూరు తల్లి

ఆదిలాబాద్

కొమురం భీం, జోడెంఘాట్
గిరిజన వీరుల చరితను చాటు
మేస్రం జాతి తప్పదు నీతి
నడిపించె నాగోబాజ్యోతి
గోండు కోలన్, థొటిఆత్రం
గుస్సాడి నాట్యం, నిర్మల సిత్రం
బాసర తీర్ధం, సంగమ క్షేత్రం
కుంటాల ఝరి జల సంగీతం 
ఇప్ప జిట్ట రేగు టేకు 
నల్లమద్ది దిరిశన మాకు 
ఆదిలబాదుకు అడవే సోకు   

నిజామాబాద్  

జైనుల బౌద్ధుల  
జైనుల బౌద్ధుల భోదనశాల 
విష్ణు కుండినులు ఏలిన నేల
జీనవల్లబుడు హరికేసరుడు  
పంపకవి ప్రవచించిన బోధలు 
ఇంధ్రపురి కైలాసగిరి 
బాలకొండ దుర్గాలబరి  
నల్లరేగడి పసుపు యాగడి   
చెరుకు వెన్నులు పాల జున్నులు   
పంటసేల తళుకు పల్లె పరవశించి కులుకు  
పెద్దగుట్ట ఉరుసు 
బోధను చక్కరయ్యి కురుసు  
గల గల గల గల పైరుల మిలమిల 
నిజామబాదు సిరులకు కళ కళ     
గల గల గల గల పైరుల మిలమిల
నిజామబాదు సిరులకు కళ కళ

ఖమ్మం

పర్ణశాల...
పర్ణశాలసీతమ్మ అడుగులు
భద్రాచలముల నిత్య వేడుకలు
కోనలెంట గోదావరి పరుగులు
జంటగ కిన్నెరసాని నడకలు
పగలే నీడలు పరిచిన చందము
పచ్చని టేకు గొడుగులె అందము
బొగ్గు బావులు అగ్గి నెలవులు
పల్వంచ ఇలపంచె వెలుగులు
గిరిజన జాతుల ఆయువు పట్టు
ఆశయాలు విరబూసిన చెట్టు
ఖనిజరాసులకు తరగని గట్టు
ఉద్యమాల ఖిల ఖమ్మం మెట్టు

మెదక్
మంజీర కంజీరనాదం
సింగూరు జలపొంగులహారం
సంగమ తీర్ధం సాదుల సత్రం
ఏడుపాయల శైవక్షేత్రం
మెతుకు దుర్గముల మేటి కొలుపులు
కోటను మించిన చర్చి తలుపులు
చెరివిరాల బాగయ్య దరువులు
యక్ష్యగాన ఎల్లమ్మ అడుగులు
మల్లినాధుని లక్ష్యణభాష్యం
మాటను పాటను పోటెత్తించిన
నేతల కవులను ఇచ్చిన జిల్లా
తల్లి మెదకు జిల్లా
మలి ఉద్యమాల ఖిల్లా

హైదరాబాద్

మదిలో మెదిలే వదిలిన తావుల
మసలుల కదిపే పల్లె గురుతుల
బతుకుల యాగం బరువుల దాగం
ఉరుకుల పరుగుల బతుకుల తాళం
మరిపించి మురిపించె దామం
భాగ్యనగరమే ఇంద్రభువనము
ఆదరించమని చాపిన దోసిట
అక్ష్యయపాత్రే హైదరబాదు
కుతుబ్ షాహీ అసఫ్ జాహీ
ఘజల్ ముషాహీర్ సునోరె భాయీ
చార్మినారు మక్కా మసీదు
పురానపూల్ ధేఖొరె భాయీ
కొబ్బరి తెటను మించిన ఊట
ఉస్మాన్ సాగర్ గండిపేట
గోలుకొండన ఎగిరే జెండ
ఆశలు విరియును ప్రతిఎదనిండా

ఆశలు విరియును ప్రతిఎదనిండామేం పనికిమాలినయ్ రాయం,ఓ Like కొట్టుర్రి సాలు

టిట్టర్ ల మా యెమ్మటివడాలంటె గీ Follow అనే దాన్ని వొత్తుర్రి

శానా మంది సూశిన ముచ్చట